నర్రవాడ దొడ్డ కొండపై వెంగమాంబ విగ్రహం వద్ద ఈనెల 25న కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఉషశ్రీ శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం మేళ తాళాలు నడుమ స్థాపన కార్యక్రమం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహా నైవేద్యం తదితర కార్యక్రమాలు అలాగే సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొనాలని ఆమె కోరారు.