నెల్లూరు జిల్లా వరికుoట పాడు మండలం కాంచెరువు పాఠశాలలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల నూతన చైర్మన్ గా ఎన్నికైన రేగుదల సుహాసిని జాతీయ జెండా ఎగరవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.