అనంతపురంలోని ఎంపీ కార్యాలయంలో ఆదివారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను ఏపీ నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కడియాల కొండన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నాయీబ్రాహ్మణ సామాజికవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఇరువురు చర్చించారు. కార్యక్రమంలో ఆయన తోపాటు పలువురు నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.