తల్లి చెంతకు పరుగెత్తి.. అంతలోనే కుప్పకూలిన చిన్నారి
అమ్మను చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన ఖమ్మం (D) రూరల్(M) ఎంవీపాలెంలో సోమవారం జరిగింది. కుర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక(4). సోమవారం లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసి ఇంటికి వస్తుండగా తల్లిని చూసిన ప్రహర్షిక ఒక్కసారిగా పరుగెత్తుతూ కిందపడిపోయింది. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు చెప్పారు. చిన్నారి గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.