కళ్యాణదుర్గం: రోడ్డుకు ఇరువైపున ఉన్న కంప చెట్లు తొలగించండి

56చూసినవారు
కళ్యాణదుర్గం: రోడ్డుకు ఇరువైపున ఉన్న కంప చెట్లు తొలగించండి
కంబదూరు, కళ్యాణదుర్గం ప్రధాన రహదారిలో అండేపల్లి గ్రామ శివార్లలో మలుపు వద్ద కంపు చెట్లు విపరీతంగా పెరగడంతో ఈ మలుపు ప్రమాదాలకు నిలయంగా మారిందని గ్రామస్తులు శుక్రవారం విలేఖరులకు తెలిపారు. మలుపు వద్ద కంపచెట్లు విపరీతంగా ఉండటంతో ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలియక వాహనదారులు తికమకపడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయంలో ఆర్అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుకిరువైపుల ఉన్న కంపు చెట్లను తొలగించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్