బుళ్ళసముద్రం గ్రామంలో గంగరత్నమ్మ అనే మహిళారైతు కి గోకుల్ షెడ్ ను కట్టించి, ప్రారంభించిన రాష్ట్రటిడిపి ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. మడకశిర ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ 1. 85 లక్షలతో గోకులం షెడ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతాంగానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.