కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వారికి భారీ ఊరట
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో హోంగార్డులకు భారీ ఊరట లభించింది. తమకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వారికి దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని ఏపీఎస్ఎల్ఆర్పీబీని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.