TG: మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయారంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. కేసీఆర్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని, తన కుమారుడిని ఎలాగైనా ఛాంపియన్ చేసేందుకు ఆరాటపడుతున్నారని ఆరోపించారు. అధికారం చేజారి ఏడాది కూడా అవ్వకముందే మళ్ళీ అధికార దాహంతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులపై జరిగిన దాడిని కూడా సమర్థించుకుంటున్నారు అంటే వీళ్ళను ఏమనాలి? అని ప్రశ్నించారు.