ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీబాయ్ వైద్య కళాశాలలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలకు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ ఖండించారు. ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్, జూన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించామని, ఆ ఆస్పత్రిలో అగ్నిమాపక వ్యవస్థ సరిగ్గానే ఉందని ఓ ప్రకటనలో వెల్లడించారు.