అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వరుస హత్యాయత్నాలు కలకలం రేపాయి. వీటి వెనుక ఇరాన్ హస్తం ఉందంటూ అప్పట్లో ఆరోపణలు రావడంతో అమెరికా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తాజాగా దీనిపై స్పందించిన ఇరాన్.. తమకు ట్రంప్‌ను చంపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వానికి సందేశం పంపింది. టెహ్రాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నుంచే ఈ సందేశం వచ్చినట్లు సమాచారం.