పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల్లో నాణ్యతలో రాజీపడొద్దని, గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి ఎస్. సవిత ఆదేశించారు. సోమవారం సోమందేపల్లి గ్రామంలోని సాయి నగర్ లో మంత్రి మాట్లాడుతూ కేవలం 5 నెలల కాలంలోనే సోమందేపల్లి వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో చేసి చూపించామన్నారు.