రాయదుర్గం: ప్రమాదవశాత్తు నీట మునిగిన బాలికలు

50చూసినవారు
రాయదుర్గం: ప్రమాదవశాత్తు నీట మునిగిన బాలికలు
గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తల్లి శృతితో పాటు బట్టలు ఉతకడానికి ఇద్దరు కుమార్తెలు సంగీత, పవిత్ర వేదావతి హగరి నదికి వెళ్లారు. ప్రమాదవశాత్తు సంగీత, పవిత్ర నీట మునిగి అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు ఒడ్డుకు తీసు కొచ్చి హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంకు తరలించారు.

సంబంధిత పోస్ట్