శింగనమల తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు రైతు సంఘం మండల కార్యదర్శి కోండపల్లి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అదే విధంగా కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ బ్రహ్మయ్యకు అందజేశారు.