తాడిపత్రి పట్టణంలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టగా మార్చి -2024 నుంచి నవంబర్ వరకు రూ. 9, 21, 152ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డివిజన్ తనిఖీ అధికారి వన్నూర్ వలీ, తదితరులు పాల్గొన్నారు.