ఐ జే నాయుడు కాలనీలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ

64చూసినవారు
ఐ జే నాయుడు కాలనీలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి ఐ జే నాయుడు కాలనీలో శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో అర్హులైన వారికి ప్రభుత్వం నుంచి మంజూరైన హెల్త్ కార్డులను బయోమెట్రిక్ పూర్తి చేసి అందించారు. ప్రభుత్వం ఇటీవలే ఆరోగ్యశ్రీ సేవలు రూ. 25 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఐజే నాయుడు కాలనీలో సుమారు 300 కార్డులను పంపిణీ చేసినట్లు వాలంటీర్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్