ఆమదాలవలస: తెలగ కులస్తులను బీసీల జాబితాలో చేర్చాలి

74చూసినవారు
ఆమదాలవలస: తెలగ కులస్తులను బీసీల జాబితాలో చేర్చాలి
తెలగ కులస్తులను బీసీల జాబితాలో చేర్చాలని తెలగ సంఘం ఉత్తరాంధ్ర నాయకుడు పి. వెంకట రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆమదాలవలస పరిధిలో మన్నయ్య పేట ఉద్యాన వనంలో తెలగ కులస్తుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి తెలగ కులస్తులను బీసీల జాబితాలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలగ కులస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్