ప్రభుత్వం ఎస్ఈబి పేరును ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ గా మార్పు చెందించడం హర్షనీయమని ఆముదాలవలస ఎక్సైజ్ ఎస్సై రాజారావు అన్నారు. ఈ మేరకు శనివారం ఆముదాలవలస ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అలాగే ఆముదాలవలస ఎస్ఈబి స్టేషన్ బోర్డును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గా మార్చామని అన్నారు.