ఆముదాలవలస రైల్వే స్టేషన్ వెలుపలి ప్రాంగణానికి సమీపంలో తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభను గురువారం ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు లైవ్ టెలికాస్ట్ నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాయశ్చిత్తం దీక్ష అనంతరం తిరుపతి లడ్డు ప్రసాదంపై గత ప్రభుత్వం చేసిన అపచారాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించారని రామ్మోహన్ రావు అన్నారు.