పాలకొండలోని శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంకు చెందిన సెనగల దుర్గారావు స్వామి ఆధ్వర్యంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ముగించుకొని సోమవారం శబరిమలకు స్వాములు బయలుదేరారు. ఈ మేరకు అయ్యప్ప స్వాముల అందరూ ఇరుముళ్ళు తలపై పెట్టుకొని 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ ఆంజనేయ స్వామి సన్నిధానం నుంచి శ్రీ కోట దుర్గమ్మ ఆలయం వరకు అయ్యప్ప స్వాములు కుటుంబ సభ్యులతో ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.