
పాలకొండ: ఫ్లెక్సీల తొలగింపు
పాలకొండలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న ఒక ప్రైవేట్ స్కూల్ ఫ్లెక్సీలను ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం సాయంత్రం తొలగించారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని వారు మంగళవారం అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్ మాట్లాడుతూ, అనుమతులు లేకుండా అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే ఏఐఎస్ఎఫ్ ఊరుకోదన్నారు.