మెళియాపుట్టి మండలంలోని గంగరాజుపురం గ్రామానికి చెందిన సంతోష్ బిస్వాల్ అనే యువకుడు రహదారి ప్రమాదంలో మంగళవారం మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు గంగరాజుపురం నుంచి సుందరాడ దైవ కార్యక్రమం నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. యువకుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.