పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు సందర్భంగా ఆదివారం లలిత త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. దేవదాయ, ధర్మదాయ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు సందర్బంగా లలిత త్రిపుర సుందరీ దేవి కి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు లలితాష్టోత్తర, త్రిశతి నామార్చనలు, శ్రీ సూక్త, దుర్గాసూక్త ,పూజ కార్యక్రమాలు నిర్వహించారు.