టెక్కలి: ఎండల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

64చూసినవారు
టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం భక్తులు రద్దీ నెలకొంది. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వేకువజాము నుంచి స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్