ఇచ్చాపురంలో నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల

73చూసినవారు
ఇచ్చాపురంలో నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల
ఇచ్ఛాపురం మండలంలోని ఇచ్ఛాపురం, ఈదుపురం సబ్ స్టేషన్ ల పరిధిలోని ఇచ్ఛాపురం హాస్పిటల్ రోడ్, మంగళవారంపేట, డొంకూరు, కేశుపురం, తిప్పనపుట్టుగ, మండపల్లి ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఈఈ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్