కవిటి: ఐదు పంచాయతీలకు ట్రాక్టర్లు మంజూరు
కవిటి ఎంపీడీవో కార్యాలయంలో కొత్త ట్రాక్టర్లను ఎమ్మెల్యే అశోక్ బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు మాణిక్యపురం, సహలాల పుట్టుగ, లండారు పుట్టుగ, కపాసకుద్ది, నెలవంక పంచాయతీలకు సంబంధించి పంపిణీ చేసే క్రమంలో ఆయన ట్రాక్టర్ నడిపారు. పరిశుభ్రత-పారిశుద్ధ్యం ముందుచూపుతో దృష్టి సారించి ట్రాక్టర్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కూటమి నాయకులు పాల్గొన్నారు.