కృష్ణా జిల్లాలో కొట్టుకుపోయిన యువకుడు.. వీడియో ఇదిగో!

60చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా జిల్లా చంద్రాలపాడు మండలంలోని ముప్పాల గ్రామంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ఓ యువకుడు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు.