విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైంది. రెండు రోజులుగా నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. పలు కాలనీల్లో 4 అడుగుల మేర వరద నీరు నిలిచింది. ఆటో నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలిచింది.