ఏపీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారికి పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ganeshustav.net అనే వెబ్‌సైట్ లేదా 7995095800 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.