హైవేలో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
కంచిలి హైవే రోడ్డుపై గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురుగా ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జలంత్రకోటకు చెందిన మూలి ప్రకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో అతనితో పాటు చిన్న పాపకి కాలు కూడా విరిగినట్లు చెబుతున్నారు. వెంటనే 108 ద్వారా స్థానికులు హస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంకి గల వివరాలు తెలియాల్సి ఉంది.