ఒడిశా రాష్ట్రం కోదల రాంపల్లి నుంచి ముంబాయికి తరలిస్తున్న సుమారు 18 కిలోల గంజాయిని కంచిలి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఏఎస్పీ పి.శ్రీనివాసరావు విలేకరులకు వెల్లడించారు. కోదల రాంపల్లి గ్రామానికి చెందిన సంజయ్ పొలాట, సాగర్ పొలాట ముంబాయిలోని ముఖేష్ అనే వ్యక్తితో గంజాయి ఉన్న బ్యాగ్‌తో సంతోష్‌కుమార్ సాహు సోంపేట రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది అతడిని తనిఖీ చేయగా.. గంజాయి ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.