వేతనాలు చెల్లించాలని ఉపాధి కూలీల ధర్నా
ఉపాధి వేతనాలు చెల్లించాలంటూ కొత్తూరు మండలంలోని గొట్టిపల్లి గ్రామ సచివాలయం వద్ద పలు గిరిజన గ్రామాలకు చెందిన గిరిజన ఉపాధి కూలీలు ఖాళీ భోజనం ప్లేట్లతో మంగళవారం ధర్నా నిర్వహించారు. నెలలు తరబడి వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కుటుంబాలతో పస్తులు ఉంటున్నామని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేత సిర్ల ప్రసాద్ పాల్గున్నారు.