వివాహిత ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజం గ్రామానికి చెందిన సమీరకు మందస చిన్న కేశవరానికి చెందిన బొడ్డు భవాని శంకర్ తో 2022లో వివాహమైంది. అయితే ఇప్పటివరకు సంతానం లేకపోవడంతో అత్తింటి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.