సూర్య ‘కంగువా’ మూవీ రిలీజ్ తేదీ ప్రకటించిన చిత్రబృందం

79చూసినవారు
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువ' మూవీ రిలీజ్ పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14 న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ అక్టోబర్ 10 న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనిపై సినీప్రియులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దర్శకుడు శివ పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్