దున్నవూరు గ్రామ సమీపంలో ఎలుగుబంటి హల్చల్
ఆదివారం ఉదయం మందస మండలం దున్నవూరు గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. సమీప తోటల్లోకి పనులకు వెళ్లిన స్థానికులకు ఎలుగుబంటి ఎదురవ్వడంతో భయాందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వీడియోలు తీశారు. రెండు నెలలు క్రితం ఉద్దాన ప్రాంతంలో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా కొంతమంది తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.