అమెరికాలోని డెలావేర్‌లో జరుగుతున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ఇది అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని మోదీ అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతకుముందు బైడెన్ తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయని మోదీ తెలిపారు.