టెక్కలి: విద్యార్థులను పరామర్శించిన డీఈవో తిరుమల చైతన్య
మెలియాపుట్టి సమీపంలో ఆటోలు ఢీకొన్న ఘటనలో గాయపడిన విద్యార్థులను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య పరామర్శించారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొసమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన డీఈఓ ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సరియైన వైద్యం అందించాలని ఆయన కోరారు.