శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు

50చూసినవారు
శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు
రాజాం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేష పూజలను దేవాలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ అర్చకులు శుక్రవారం కావటంతో అమ్మవారికి కుంకుమపూజలను నిర్వహించారు. లలిత సహస్ర నామావళి, అష్టోత్తర శతనామావళితో అమ్మవారికి వివిధ వర్గాల పుష్పాలతో అర్చన జరిపారు. అత్యధికంగా మహిళ భక్తులు అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్