శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ బెల్స్.. ఇక కష్టమే

565చూసినవారు
శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ బెల్స్.. ఇక కష్టమే
ఈ ఏడాది కృష్ణా బేసిన్ లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండలేదు. దీంతో ఈ వేసవిలో సాగునీరుతో పాటు తాగు నీరు కటకటగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడుగంటుతోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరిలోనే నీరు డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం నీరు డెడ్ స్టోరేజీకి అడుగు దూరంలో ఉంది. దీంతో ప్రాజెక్టును నమ్ముకుని పంటలు సాగు చేసిన వారు ఆందోళనలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్