రేపు ఉదయం తిరుపతి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు రేపు ఉదయం తోక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించనున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తోపులాట ఘటనల్లో ఆరుగురు చనిపోయారు.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు.