ప్రస్తుతం ఆల్కహాల్ తాగే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే మద్యంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొంత మోతాదులో తీసుకున్నా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు యూఎస్ సర్జన్ జనరల్ నివేదిక వెల్లడించింది. క్వాంటిటీతో సంబంధం లేకుండా లిక్కర్‌తో రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, లివర్, నోరు, గొంతు, స్వరపేటిక వంటి 7 రకాల క్యాన్సర్లు వస్తాయని పేర్కొంది. మహిళలకు ఎక్కువగా ముప్పు ఉందని పేర్కొంది. 5.6% క్యాన్సర్ కేసులకు, 4% క్యాన్సర్ మరణాలకు మద్యపానమే కారణమని తెలిపింది.