హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు దగ్గరుండి కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్, హుడా ఎన్‌క్లేవ్ కాలనీలతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీలను సందర్శించారు. ఆక్రమణలపై మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఇక్కడ అక్రమ నిర్మాణాలపై విచారణ నిర్వహించి చర్యలు చేపడతామని తెలిపారు.