AP: రాష్ట్రంలోని గీత కార్మిక కులాలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మరో రెండు, మూడు రోజుల్లో గీత కార్మిక కులాలకు కేటాయించిన 10 శాతం మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. అందులో భాగంగా శెట్టిబలిజ, గౌడ, ఈడిగ, గౌడ్, యాత, శ్రీశయన, గౌండ్ల, శెగిడి, గామల్ల కులాలకు మొత్తం 335 మద్యం దుకాణాలను రిజర్వు చేశారు. వీటికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది.