గుడివాడలో టీడీపీ కార్యకర్త హల్‌చల్?

61చూసినవారు
ఏపీలో టీడీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. గుడివాడలో వైసీపీ కార్యకర్త కారు అద్దాలను టీడీపీ కార్యకర్త బద్దలు కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏలూరు రోడ్డులోని పార్కింగ్ లో ఉన్న కారు అద్దాలను మద్యం మత్తులో ఉన్న టీడీపీ నేత బాలు ధ్వంసం చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంపేస్తానంటూ రోడ్లపై అరుస్తూ సామాన్య ప్రజలను బాలు భయభ్రాంతులకు గురి చేశాడని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్