కోల్కతాలో ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేష్ పిలుపునిచ్చింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా రాష్ట్ర శాఖ సంఘీభావం తెలిపింది. ఈ సమయంలో అత్యవసర సేవలు కొనసాగుతాయని, ఓపీలు పని చేయవని, సర్జరీలు వాయిదా వేస్తామని పేర్కొంది.