విశాఖ డెయిరీ నిర్వాహకుల దోపిడీని అడ్డుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. స్వలాభమే పరమావధిగా పనిచేస్తున్న పాలకవర్గం రైతులను నిలువునా ముంచుతోందని ఆయన ఆరోపించారు. విశాఖలో 7.95 ఎకరాల భూమిని విశాఖ డెయిరీ పెద్దలు ఆక్రమించారన్న జనసేన నేత మూర్తియాదవ్ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.