నేటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ ప్రచార కార్యక్రమం

63చూసినవారు
నేటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ ప్రచార కార్యక్రమం
ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలపై ఈ నెల 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో గ్రామ, వార్డు స్థాయిలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని వంద రోజుల్లో సాధించిన విజయాలపై ప్రసంగించనున్నారు.

సంబంధిత పోస్ట్