వాకాడు మండలం పూడిరాయదొరువుకు చెందిన 100 కుటుంబాలు సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోవిందయ్య, రాజగోపాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సుబ్బారెడ్డి, మీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.