వైసీపీకి నేతల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడారు. వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేయాలని ఫిక్సయ్యారని అంటున్న నేపథ్యంలో.. ఆమె తదుపరి మజిలీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. అందుకు గల బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు వాసిరెడ్డి పద్మ చాలా సన్నిహితురాలని.. ఈమెకు షర్మిల ఆర్థికంగా కూడా సపోర్ట్ చేశారని అంటుంటారు.