AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా జరిగిన విచారణలో ఇరు వైపులా వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. పేర్ని నాని భార్య జయసుధ గోదాంలో బియ్యం మాయం కేసులో పేర్ని నాని మచిలీపట్నం పోలీసులు ఏ6గా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నాని ఆదేశాల మేరకే రేషన్ బియ్యం లావాదేవీలు జరిగినట్లు గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.