ముంబై నటి కాదంబరి జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో నటిని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులపై వేటు పడిన విషయం తెలిసిందే.